Monday 30 November 2015

చిట్టి కథలు-15

                            దెయ్యం!
డిలో పిల్లలంతా అల్లరి చేస్తున్నారు. వారి ఆటలను కట్టించడానికి ఉపాధ్యాయుడు వారిని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కరిని అడుగుతూ తప్పుడు సమాధానాలను చెప్పని వారిని శిక్షిస్తున్నాడు. ఆ తరగతిలో అల్లరి సూర్యం తన వంతు వస్తుందని భయపడుతుండగానే  ఉపాధ్యాయుడు అతనిని లేపి “ఆస్ట్రేలియా జాతీయ జంతువేది?” అని అడిగాడు. సహాయం కోసం  పక్కనున్న రాము వైపు చూశాడు సూర్యం. అతడూ ఆలోచిస్తూ కంగారు పడవద్దన్నాడు. వెంటనే “కంగారూ” అని సమాధానమిచ్చాడు సూర్యం. ఉపాధ్యాయుడు సూర్యంకి సహాయపడరాదని రాముని తన పక్కకు పిలిచి “మన జాతీయ జంతువేది?” అని అడిగాడు సూర్యాన్ని. మరలా సూర్యం రాము వైపు సహాయం కోసం చూసాడు. రాము తెలివిగా ఆలోచించి, ఉపాధ్యాయునికి తెలియకుండా చేతులు, మూతి వంకరగా పెట్టి పులిలా అభినయించాడు.  అది అర్థం కాని సూర్యం “దెయ్యం” అని ఠక్కున సమాధానమిచ్చాడు. అంతే తరగతిగది అంతా నవ్వులతో నిండిపోయింది. తరువాత ఉపాధ్యాయుడు పిల్లలందరికీ కథలు చెప్తూ దేనికైనా ఇతరులపై ఆధారపడితే వచ్చే ఇబ్బందులను బాగా వివరించాడు.
                      రచన: తుంబలి శివాజీ

4 comments:

  1. చాలా బాగుంది సార్. నమస్కారం. అభినందనలు

    ReplyDelete
  2. చాలా బాగుంది సార్. నమస్కారం. అభినందనలు

    ReplyDelete
  3. ధన్యవాదాలు. నమస్సులు.

    ReplyDelete
  4. ధన్యవాదాలు. నమస్సులు.

    ReplyDelete