Showing posts with label News. Show all posts
Showing posts with label News. Show all posts

Wednesday, 17 February 2016

No comments:
   ప్రముఖ సినిమా రచయిత, నాటకకర్త, కథకులు శ్రీ నడిమింటి నరసింగ రావు గారు ఈ రోజు (17.2.2016) గుంప సోమేశ్వర క్షేత్రం లో భద్రకాళి ప్రతిష్టాపన కోసం సతీ సమేతంగా  విచ్చేశారు. వారు చిన్నపిల్లకోసం ఆనందబాల చేస్తున్న కృషిని ఎంతగానో కొనియాడారు. వారికి ఆనందబాల ధన్యవాదాలు తెలియజేసుకొంటోంది.

   శ్రీ నరసింగ రావు గారి జన్మ స్థలం కురుపాం (విజయనగరం జిల్లా) . జాతీయ స్థాయిలో నిలబడిన ఏకైక తెలుగు నాటకం "బొమ్మలాట" రచయిత శ్రీ నడిమింటి నరసింగ రావు గారు. రాంగోపాల్ వర్మ "అనగనగా ఒక రోజు", "కళ్ళు" వంటి ఎన్నో సినిమాలకు మాటలను అందించారు.  ఈ టీవీ లో  ఎన్నో డైలీ సీరియల్స్ కి మాటలు అందించారు. వారితో నేను కలిసి ఈ టీవీ "శ్రీభాగవతం" సీరియల్  కి మాటలను రాయడం జరిగింది.
                                          - తుంబలి శివాజీ  

Wednesday, 30 December 2015

No comments:
శుభాకాంక్షలు

ఆనందబాల... ఆబాలగోపాలం  అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటోంది. ఈ ఏడాది అంతా శుభాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తోంది..పిల్లలలెక్కడున్నాఆనందమే. ఆ పిల్లలను ఆనందపెడితే లోకానందమే. అదే ఆనందబాల లక్ష్యం. ఈ ఏడాది కొత్త సొబగులతో వస్తున్న ఆనందబాలను  వీక్షిస్తూ ఉండండి. శుభమగుగాక. 

Saturday, 26 December 2015

No comments:
క చిత్రం వేయి హృదయాలను కదిలిస్తుంది. వేల స్వప్నాలను ఆవిష్కరిస్తుంది. ప్రకృతి అందాలను కళ్ళకు కట్టినట్టు చూపుతుంది. కళాకారులు తనలోని స్పందనలను, తనకు ఎదురైన అనుభవాలను పదిలపరచుకొనేందుకు చిత్రకళను సాధనంగా మలచుకుంటాడు. కోటి  భావాలను ఒక గీతలో ప్రపంచానికి పరిచయం చేయగలడు చిత్రకారుడు.  అనుభూతులను ఆవిష్కరించడమే కాదు అన్యాయాలను ప్రశ్నించడమూ కళకు మరింత కళను తెస్తుంది.  అటువంటి కళాకారులు శ్రీ ఆప్తచైతన్య. పార్వతీపురంలో 27 డిసెంబర్ 2015 నాడు చిత్రకళా ప్రదర్శనను నిర్వహిస్తున్నారు.  ఆబాలగోపాలం ఆనందంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని అరుదైన అనుభూతులను మీ సొంతం చేసుకోండి.   
                                                                                                               - తుంబలి శివాజీ

Wednesday, 9 December 2015

3 comments:
"ఊహలకే రెక్కలోస్తే" జానపద నవల
పిల్లలూ !  భుజం మీద పుస్తకాల సంచి, చేతిలో ఆహారపు బాక్సుతో బడికి  వెళ్ళుతున్నప్పుడో, రోడ్డు మీద ట్రాఫిక్ జాంలో ఇరుకున్నప్పుడో ‘ఈ బాదరబందీలు లేకుండా ఏదైనా పక్షిలా మారిపోయి కావలసిన దగ్గరకు ఎగిరి వెళ్ళగలిగేలా భుజాలకు రెక్కలుంటే బాగుండును అనిపిస్తుంది కదూ!’  గాలిలో ఎగిరి వెళ్ళే పక్షులను చూసినప్పుడల్లా  “వాటి పనే బాగుంది. పుస్తకాలు మొయ్యక్కరలేదు.  ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగక్కర లేదు. గాలిలో ఎగురుతూ నచ్చిన ప్రదేశానికి  వెళ్లొచ్చు . చార్జీలు కట్టక్కరలేదు” అనిపిస్తుంది కదూ! మీకే కాదు చాలా మంది పిల్లలకి  అలాగే  అనిపిస్తుంది.
అలాంటి ఆలోచనే  ఊహలకే రెక్కలొస్తే  నవలా నాయకుడు, యువరాజు  ఆనందవర్మకి కూడా వచ్చింది. కావలసిన రూపంలోకి మారిపోయే మంత్రం ఆనందవర్మకు ఒక వింత వస్తువు ద్వారా తెలుసుకున్న ఆనందవర్మ  నచ్చిన పక్షి రూపంలోకి మారిపోయేవాడు .  అవేం  మాట్లాడుకుంటాయో, ఎలా ప్రవర్తిస్తాయో   తెలుసుకునే వాడు . అంతులేని ఆనందం అనుభవించేవాడు.
తన సైనికులు తిరుగుబాటుకు  కుట్ర చేస్తున్నారని వేగుల ద్వారా విన్న ఆనందవర్మ ,  సైనికులు సమావేశమైన చోటుకి పిచ్చుక రూపంలో వెళ్లి వాళ్ళ ముఖాలు చూడడమే కాకుండా వాళ్ళేం మాట్లాడుకున్నారో వింటాడు. సైనికులని  పిలిచి తనకు తెలిసిన సంగతులు చెప్పి ఎందుకు శిక్షించకూడదో చెప్పమంటాడు. వాళ్ళు బుకాయించినా సరే తప్పించుకోలేక పోతారు. సైనికులoదరినీ ఖైదు చేసి శిక్షిస్తాడు ఆనందవర్మ.
మనసుకి నచ్చిన యువతిని ఆమెకు తెలియకుండా దగ్గర నుండి చూడాలని,  భార్యగా చేసుకోవాలని చిలుక రూపంలో వెళ్లి ఆమెను  కలుస్తాడు ఆనందవర్మ. అప్పుడు ఆమె అందం చూసి ముచ్చట పడి ఆమెనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
అప్పటికీ వింత సరదా తగ్గించుకోమని తెలివైన మంత్రి సలహా ఇస్తుంటాడు ఆన0దవర్మకి. వాటిని పెడచెవిని  పెట్టి మనసుకి నచ్చిన పక్షి రూపంలోకి మారిపోయి విజయాలు సాధిస్తూ , క్లిష్టమైన పరిపాలనా సమస్యలని కూడా సులభంగా పరిష్కరించిన  యువరాజు ఒకసారి  ఆపదలో చిక్కుకుంటాడు. ఆయన ఆపద నుండి బయటపడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు? పక్షి రూపంలోకి మారిపోయి సరదా తీర్చుకోవాలన్న ఆలోచన ఆనందవర్మ జీవితంలో ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? తెలుసుకోవాలంటే మాత్రం “ఊహలకే రెక్కలొస్తే”  నవలను  వెంటనే కొని చదవాల్సిందే. మీరు కూడా మీ ఊహలకు రెక్కలు తొడిగి ఆనందలోకాల్లో విహరించి రావాలనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం? వెంటనే ‘ఊహలకే రెక్కలోస్తే’ నవల కొని చదివెయ్యండి!
ప్రముఖ చిత్రకారుడు తుంబలి శివాజీ చిత్రించిన అందమైన ముఖచిత్రంతో, నాణ్యమైన కాగితంపై బొమ్మలతో ముద్రించిన ఈ నవల ధర 45.00 రూపాయలు మాత్రమే.  ఇది గోత్ర పబ్లికేషన్స్ ప్రచురణ. కాపీలు కావల్సిన వాళ్ళు  గోత్ర పబ్లికేషన్స్, పార్వతీపురం (98492 27509) వారిని సంప్రదించవచ్చు.  లేదా మీకు దగ్గరలోని నవచేత పబ్లిషింగ్ హౌస్ లేదా విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ దగ్గర పొందవచ్చు. లేదంటే నవలా రచయితను కింది చిరునామాలో సంప్రదించి పొందవచ్చు.  ఎక్కువ కాపీలు కొనే వారికి డిస్కౌంట్ ఉంటుంది. 
చిరునామా: నారంశెట్టి ఉమామహేశ్వరరావు, ఇంటి నెంబరు:14-1-83, సరస్వతీ నివాస్, గవర్నమెంట్ ఆసుపత్రి రోడ్, సబ్ జైలు ఎదురుగా, బెలగాం, పార్వతీపురం H.O. విజయనగరం జిల్లా (ఆంధ్ర ప్రదేశ్)
CELL: 94907 99203, 7386406905.

                                                - సమీక్ష: గుడ్ల అమ్మాజీ ,పార్వతీపురం.

Thursday, 5 November 2015

No comments:
హృదయపూర్వక శుభాభినందనలు

బాలగోకులం బాలల సాహిత్య  సాంస్కృతిక సంస్థ ద్వారా నవంబర్ 15 వ తేదీన "బాలనేస్తం" పురస్కారం పొందబోతున్న బాల సాహితీశిల్పులు  మరియు మిత్రులు శ్రీ నారంశెట్టి ఉమా మహేశ్వర రావు మరియు శ్రీ పైడిమర్రి రామకృష్ణ గార్లకు హృదయపూర్వక  శుభాభినందనలు.                               -ఆనందబాల 

Tuesday, 11 August 2015

ఆనందబాల సచిత్ర బాలల మాస పత్రిక - ఆగస్ట్ 2015 ముఖచిత్రం

No comments:
Aanandabala - Children's Telugu monthly is very entertaining for all. Please view this blog for children's stories. It's very useful for children to grow up their creativity and language skill.

Tuesday, 21 July 2015

ఆనందబాల ఆవిష్కరణ

No comments:

ఆనందబాల బాలల సచిత్ర మాస పత్రిక తేది 19-07-2015 నాడు విజయనగరం జిల్లా పరిషత్ హాల్ లో మనోహరంగా ఆవిష్కరింపబడింది. తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆనందబాల సంపాదకులు, సినీ గేయరచయిత శ్రీ తుంబలి శివాజీ, తెలుగు రక్షణ వేదిక అధ్యక్షులు శ్రీ పొట్లూరి హరికృష్ణ గారు, జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి శోభా స్వాతిరాణి గారు, తెలుగు రక్షణ వేదిక రాష్త్ర కార్యదర్శి శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు, గజపతినగరం ఎమ్మెల్యే Dr. K. A. నాయుడు, పార్వతీపురం మాజీ ఎంపీ Dr. DVG శంకరరావు గారు, మంచిపల్లి శ్రీరాములు గారు ఇంకా వందలాది సాహిత్యవేత్తలు పాల్గొన్నారు.

Tuesday, 14 July 2015

రాజస్థాన్ జానపద సంగీత వాయిద్యం

No comments:
A poor villager in Jaipur played this song on this musical instrument called bulbul. When I was visiting Jaipur fort I recorded this. Enjoy please..

Sunday, 5 July 2015

aanandabala

No comments:
Aanandabala a children's monthly started from July 2015. Editor and publisher  Tumbali Sivaji from Parvathipuram(Lakshminarayanapuram).  Its most useful for children for developing their moral values and creativity.